పకోడీలు తినడానికి ఒక సమయం అవసరమా అనిపిస్తుంది. కబుర్లు చెప్పుకుంటూ గిన్నెడు పకోడీలుంచినా ఎన్ని తిన్నామో కూడా తెలియనంతగా తినేస్తుంటాం. పకోడీలు ఎన్ని ఉన్నా వేటికవే ప్రేత్యేకం.

అలాంటి ప్రేత్యేకమైన రెసిపీనే ఈ పాలకూర పకోడీ. అందులోనూ స్వీట్ షాప్ వారు చేసే పకోడీ సంగతి చెప్పాలా? నేను ఈ రెసిపీలో స్వీట్ షాప్ వారి సీక్రెట్స్తో పాలక్ పకోడీ చెబుతున్నాను. తెల్సిన పద్ధతే అయినా ప్రతీ స్టెప్లో ఎన్నో టిప్స్ ఉన్నాయ్ అవన్నీ కింద రెసిపీలో స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ వివరంగా ఉంది చూడండి.

రెసిపీ చేసే ముందు టిప్స్ చుడండి, ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ పకోడీ వచ్చి తీరుతుంది

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు కాజు పకోడీ

టిప్స్

బొంబాయ్ సెనగపిండి/బొంబాయ్ బేసన్:

  1. స్వీట్ షాప్ వారి పకోడీ అంత కరకరలాడుతూ తేలికగా ఉండడానికి ప్రధాన కారణం బొంబాయ్ బేసన్. బొంబాయ్ బేసన్ అంటే మామలు సెనగపిండి కంటే ఎంతో మృదువుగా తేలికగా ఉంటుంది. ఈ సెనగపిండి మైదా, కార్న్ ఫ్లోర్ అంత మృదువుగా ఉంటుంది. ఈ బొంబాయి బేసన్ వాడతారు కాబట్టే పాలకూర పకోడీ అంత కరకరలాడుతూ ఉంటుంది.

  2. ఒకవేళ మీ దగ్గర బొంబాయ్ బేసన్ లేకపోతే మామూలు సెనగపిండినే 2-3 సార్లు జల్లించి వాడుకోండి, ఇంకా కొంచెం వంట సోడా వేసుకోండి.

పకోడీ పిండి కలిపే తీరు:

  1. సెనగపిండిలో పాలకూర ఆకులు వేసి తక్కువ నీటితో నెమ్మదిగా కలుపుకోవాలి. ఆకుని పిండుతూ కలుపుకోకూడదు. పకోడీ పిండి గట్టిగా ఉండాలి. కాబట్టి అవసరాన్ని బట్టి చెమ్చాలతో నీరు వేసుకోండి.

  2. బొంబాయ్ బేసన్ వాడితే నీరు చాలా తక్కువగా పడుతుంది.

పాలకూర ఆకులు:

  1. పాలకూర ఆకులు మాత్రమే వేసుకోవాలి, కాదు వేయకండి.

  2. పాలకూర ఆకుల తరుగు వేసుకుంటే పకోడీ ఎక్కువ పొడిపొడిగా అయిపోతుంది. ఈ పకోడీకి మామూలు ఉల్లిపాయ పకోడీ మాదిరి గట్టిగా వత్తుతూ పిండి కలపకూడదు. పిండిలో తడిచిన ఆకు నూనెలో వేగితే ఆకులో చెమ్మా ఆరిపోయి కరకరలాడుతూ ఉంటుంది పకోడీ.

పకోడీ వేపే తీరు:

  1. కచ్చితంగా నూనె వేడిగా ఉండాలి. లేదంటే నూనె లాగేస్తుంది పిండి.

  2. పకోడీ పిండిని వేళ్ళతో గట్టిగా నలుపుతూ మూకుడు అంతా వేసి మీడియం ఫ్లేమ్ మీద రంగు మారేదాకా వేపుకోవాలి. పకోడీ రంగు మారిన తరువాత మంట హైలోకి పెట్టి ఎర్రగా వేపి తీసుకోండి.

ఇంకొన్ని విషయాలు:

  1. స్వీట్ హౌస్ వారి పాలక్ పకోడీలో రంగు వేస్తారు కాబట్టి పసుపు పచ్చగా ఉంటుంది. నేను రంగు వేయలేదు.

  2. లేతవి మీడియం సైజులో పాలకూర ఆకులు మాత్రమే వేసుకోవాలి, కాడలు వేయకండి.

పాలకూర పకోడీ - రెసిపీ వీడియో

Palak Pakodi | Perfect Palak Pakodi with Tips

Street Food | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 15 mins
  • Total Time 20 mins
  • serves 4

కావాల్సిన పదార్ధాలు

  • 200/1.5 gms/Cups సెనగపిండి
  • 200 gms లేత పాలకూర ఆకులు
  • 5 పచ్చిమిర్చి
  • 1/2 tbsp ఉప్పు
  • 1/2 tbsp పసుపు
  • 2-3 tbsp నీరు
  • 1 tbsp జీలకర్ర
  • 1/2 tbsp అల్లం వెల్లులి పేస్ట్

విధానం

  1. పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచుకోండి
  2. గిన్నెలో జీలకర్ర, పచ్చిమిర్చి ముద్దా, ఉప్పు, పసుపు, అల్లం వెల్లులి పేస్ట్ నీరు వేసి కలుపుకోండి
  3. సెనగపిండి వేసి కలుపుకోండి. తరువాత నూతిలో కడిగిన పాలకూర ఆకులు మాత్రమే నీటిని వడకట్టి వేసుకోండి.
  4. పాలకూర ఆకులు నెమ్మదిగా నిమురుతూ పిండిని పట్టించాలి(పిండి కలిపే తీరు కోసం టిప్స్ చుడండి)
  5. మరిగే వేడి నూనెలో పాలకూరని గట్టిగా పిండుతూ సగం పిండి వేసి ముందు మీడియం ఫ్లేమ్ మీద రంగు మారేదాకా వేపుకోవాలి. పకోడీ రంగు మారిన తరువాత పెద్ద మంట మీద ఎర్రగా వేపి తీసుకోండి.
  6. బొంబాయ్ బేసన్ పకోడీ వేడి మీద మెత్తగా అనిపిస్తుంది, చల్లారాక గట్టిపడుతుంది అని గుర్తుంచుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.